జగద్గురు జయేంద్ర సరస్వతి ఆఖరి వీడియో ఇదే..చూసారా

updated: March 1, 2018 20:29 IST
జగద్గురు జయేంద్ర సరస్వతి ఆఖరి వీడియో ఇదే..చూసారా

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి (83) బుధవారం తమిళనాడులో మరణించిన సంగతి తెలిసిందే. కాంచీపురంలోని పీఠానికి 69వ అధిపతిగా వ్యవహరిస్తున్న జయేంద్ర కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కడపటిగా భక్తులకు దర్శనమిచ్చారు. గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌, రాష్ట్ర మంత్రి సెంగోటయ్యన్‌లు కూడా జయేంద్ర సరస్వతిని అదేరోజు దర్శించుకున్నారు. 

కాగా తన గదిలోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించిన స్వామి అర్ధరాత్రి దాటిన తరువాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భక్తులు హుటాహుటిన సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా.. గుండెపోటు వచ్చి ఉదయం 7 గంటల ప్రాంతంలో స్వామి మహా నిర్యాణం చెందినట్లు వైద్యులు ప్రకటించారు.  

ఈ నేపధ్యంలో ఆయన శివైక్యం చెందటానికి ముందు రోజు ..వీడియో ఒకటి బయిటకు వచ్చింది. ఆయన అభిమానులు, భక్తులు కోసం... ఇక్కడ మీకు ఆ వీడియోని అందిస్తున్నాం..చూడవచ్చు. 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments